News April 13, 2024

యుద్ధ వాతావరణం.. ఎయిరిండియా కీలక నిర్ణయం!

image

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ గగనతలం మీదుగా ఆ సంస్థ విమానాలు ప్రయాణించట్లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర మార్గాల్లో చాలా దూరం ప్రయాణించి యూరప్ వైపుగా వెళ్తున్నట్లు తెలిపాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో తమ పౌరులను ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని భారత్‌తో పాటు ఫ్రాన్స్, రష్యా కోరాయి.

Similar News

News November 16, 2024

చంద్రబాబు తమ్ముడి చివరి PHOTO

image

AP CM చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చివరి ఫొటో బయటకొచ్చింది. HYD AIG ఆస్పత్రిలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మ.12.45 గంటలకు <<14625616>>తుదిశ్వాస <<>>విడిచారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్‌పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయన మృతిపట్ల టీడీపీ శ్రేణులు, నేతలు సంతాపం తెలియజేస్తున్నారు.

News November 16, 2024

రామ్మూర్తి మరణం కలచివేసింది: పవన్

image

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలివ్వలేదు: రేవంత్

image

తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. మహారాష్ట్రలో ప్రజా తీర్పును షిండే, అజిత్ పవార్ కాలరాశారని మండిపడ్డారు. చంద్రాపూర్‌లో మహావికాస్ అఘాడీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.