News April 13, 2024
కర్నూలు జిల్లా KGBVలలో ఉత్తమ ఫలితాలు

కర్నూలు జిల్లాలో 26 KGBVలలో ప్రథమ సంవత్సరంలో 588 మంది విద్యార్థినులకు గాను 372, ద్వితీయ సంవత్సరంలో 488 మందికి గాను 358 మంది పాసయ్యారు. ఆస్పరి, దేవనకొండ, కల్లూరు, నందవరం KGBVలో 100% ఉత్తీర్ణత సాధించారు. గూడూరు KGBVలో విజయలక్ష్మి 956(MPC), కోడుమూరు KGBVలో సుమలత 963(BiPC) ప్రథమ స్థానంలో నిలిచారు. ఆస్పరి KGBVలో BiPC చదువుతున్న నిర్మల 421 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా కలెక్టర్ సృజన అభినందించారు.
Similar News
News March 7, 2026
అభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్ సమీక్ష

కర్నూలులోని కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జిల్లా కీలక పనితీరు సూచికలపై ఆమె చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌డీజీ, కేపీఐ అంశాల్లో జిల్లా మరింత పురోగతి సాధించాలని ఆమె స్పష్టం చేశారు.
News March 7, 2026
అల్లు అర్జున్‌తో శిల్పా రవి

అల్లు శిరీష్, నయనికా రెడ్డిల వివాహ వేడుకకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. పెళ్లి వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం, ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిశారు. ఈ సందర్భంగా శిల్పా రవి దంపతులు అల్లు అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.


