News November 19, 2025
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News March 18, 2026
కృష్ణా: UG కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల

కృష్ణా వర్శిటీ పరిధిలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి UG కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. 2026 ఆగస్టు 3 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమై డిసెంబర్‌లో 1వ, 2027 ఏప్రిల్‌లో 2వ, 2024 ఏప్రిల్‌లో 2వ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని KRU అధ్యాపకులు తెలిపారు. క్యాలెండర్, సెలవుల పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.
News March 18, 2026
రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, NLR, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPTYలో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
News March 18, 2026
కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

AP: అభివృద్ధి పనులు చేపట్టిన చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 50వేల మందికి ₹2,000Cr చెల్లించనుంది. ఉగాది నాటికి కొన్ని బిల్లులు చెల్లించాలని CM సూచించడంతో ఆ మేరకు విడుదల చేసింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, SDRF-SDMF వంటి హెడ్స్ కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోంది. ఈ లిస్టులో ₹కోటిలోపు పనులు చేపట్టినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.


