News November 19, 2025

KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్‌ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 13, 2026

నిర్మల్: ఈ నెల 16న ఎన్టీఆర్ స్టేడియంలో పోటీలు

image

డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ హాకీంపేట ఆదిలాబాద్, కరీంనగర్, హనుమకొండలోని క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో పద్మ తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 16వ తేదీన నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే పోటీలకు రిపోర్ట్ చేయాలని తెలిపారు.

News March 13, 2026

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. ఈ మూవీ ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బెనిఫిట్ షోలు ఆ రోజు తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ప్రదర్శితమవుతాయి.

News March 13, 2026

MNCL: పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. 48 కేంద్రాల్లో ఉ.9.30 నుంచి 12.30గంటల వరకు జరిగే పరీక్షలకు 4, 897 మంది బాలురు, 4, 806 మంది బాలికలు హాజరుకానున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.