News November 18, 2025
4 గంటల పాటు చిన్న అప్పన్నను ప్రశ్నించిన సిట్

తిరుమల కల్తీ నెయ్యి కేసులో A 24 చిన్ని అప్పన్నను సిట్ కస్టడీలో 4 గంటల పాటు విచారించారు. జీతం ఎంత? అకౌంట్లో కోట్లాది రూపాయల ఎలా వచ్చాయి? వైవీ సుబ్బారెడ్డితో పరిచయం, కల్తీ నెయ్యి గురించి తెలుసా, టీటీడీ టెండర్లు మార్పులపై ప్రశ్నించగా కొన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రాత్రికి తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు.
Similar News
News November 18, 2025
ఇవాళ భారీ వర్షాలు

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.

ఢిల్లీ పేలుడు: హమాస్ తరహా దాడికి ప్లాన్?

ఢిల్లీ పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కారు బ్లాస్ట్‌కు ముందు టెర్రరిస్టులు భారీ దాడికి కుట్ర చేసినట్లు NIA దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్లను ఆయుధాలుగా మార్చేందుకు, రాకెట్లను తయారు చేసేందుకు యత్నించారని తేలింది. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో అటాక్ చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్టయిన ఉగ్ర అనుమానితుడు డానిష్ ద్వారా ఈ వివరాలు తెలిసినట్లు సమాచారం.