News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News March 28, 2026
తిరుపతి జిల్లా బియ్యం… దళారుల మధ్యవర్తిత్వం..!

తిరుపతి జిల్లాలోని ఏర్పేడు, వెంకటగిరి, నాయుడుపేట తదితర ప్రాంతాల వరి పంటను నెల్లూరు జిల్లాలోని మిల్లర్లకు తరలిస్తున్నారు. ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తామని ప్రకటించినా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. రైతులు తీసుకెళ్లే వరి పంటను తడి ఉంది, నూక ఉంటూ కారణాలు చెప్పి వెనక్కి పంపుతున్నారు. దీంతో రూ.2వేల లోపు పంటను దళారులకు విక్రయిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
News March 28, 2026
ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్‌గా భవానీ ప్రసాద్

ఆర్టీసీ ఉమ్మడి వరంగల్ రీజనల్ మేనేజర్‌గా సోమరాజు భవానీ ప్రసాద్‌ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న వరంగల్ ఆర్ఎం విజయ భాను అదిలాబాద్ జిల్లా ఆర్ఎంగా బదిలీ చేశారు. భవానీ ప్రసాద్ గతంలో 2013-14 కాలంలో వరంగల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.
News March 28, 2026
NTR: దారుణం.. ఆరో తరగతి బాలికపై వేధింపులు!

NTR (D) ఏ.కొండూరు మండలంలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరో తరగతి చదువుతున్న బాలికపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇద్దరూ బంధువులు కావడంతో ఈ ఘటన కుటుంబ సభ్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడు వంశీకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఏ.కొండూరు ఎస్ఐ తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


