News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News March 15, 2026
ఖమ్మం: బిడ్డ పట్టుదలకు తల్లి తోడైంది

కూసుమంచి (M) కేశ్వాపురం గ్రామానికి చెందిన దివ్యాంగ విద్యార్థిని రేణుక పదో తరగతి పరీక్షకు హాజరైంది. నడవలేని స్థితిలో ఉన్న కూతురిని తల్లి శారద చంటిపాపలా ఎత్తుకుని రెండో అంతస్తులోని పరీక్షా గదికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. సహాయకుడు ఉన్నా వద్దని స్వయంగా పరీక్ష రాయాలని రేణుక పట్టుదల చూపింది. విద్యార్థిని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాన్ని కింద అంతస్తుకు మార్చాలని పలువురు కోరుతున్నారు.
News March 15, 2026
ఆదిలాబాద్: అడవి దాటితే వన్యప్రాణులకు మరణమే

ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల రక్షణ గాలిలో దీపంగా మారింది. తాళ్లపేట రేంజ్‌లో చిరుతను వేటగాళ్లు హతమార్చడం అటవీ శాఖ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆహారం కోసం రోడ్లపైకి వస్తున్న కోతులు ప్రమాదాల బారిన పడుతుండగా, గ్రామాలకు వస్తున్న జింకలు, దుప్పులపై కుక్కలు దాడి చేస్తున్నాయి. అటవీ సంరక్షణపై నిఘా పెంచకపోతే భవిష్యత్తులో వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 15, 2026
ఇలా అయితే SRHకు ఇబ్బందులు తప్పవు: పుజారా

SRHలో అభిషేక్, హెడ్, క్లాసెన్ లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉన్నప్పటికీ అనేక లోపాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ పుజారా తెలిపారు. ‘ఆ ముగ్గురు ఔటవగానే జట్టును ముందుకు తీసుకెళ్లే ప్లేయర్ కనపడటం లేదు. దీన్ని ప్రత్యర్థి జట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. అలాగే SRH హోంగ్రౌండులో మినహా మిగతా మైదానాల్లో ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ అంశాలపై మేనేజ్‌మెంట్ దృష్టిసారించకపోతే ఇబ్బందులు తప్పవు’ అని పేర్కొన్నారు.


