News April 13, 2024

‘గీతాంజలి రిటర్న్స్’పై అభిమానుల స్పందనిదే: కోన వెంకట్

image

అంజలి లీడ్ రోల్‌లో తెరకెక్కిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ఈ సినిమాకు వస్తున్న రియాక్షన్లపై కథా రచయిత కోన వెంకట్ స్పందించారు. ‘హాస్యానికి స్పందించలేని మేధో సమీక్షకులందరికీ మా అన్సర్ ఒక్కటే.. ఈ చిత్రానికి థియేటర్‌లో స్పందన ఇలా ఉంది’ అని ఓ <>వీడియో<<>>ను షేర్ చేశారు. గీతాంజలికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు.

Similar News

News March 12, 2026

NLG: మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో బస్సులు కేటాయించారు.

News March 12, 2026

ఉగాది రోజు ఇలా చేయకండి: పండితులు

image

ఉగాది రోజున తప్పక పాటించాల్సిన నియమాలను పండితులు సూచిస్తున్నారు. ‘ఈ పర్వదినాన మాంసం ముట్టకూడదు. శాకాహారమే భుజించాలి. ఎవరిపై కోప్పడొద్దు. కన్నీరు పెట్టుకోకూడదు. ఈరోజుతో ఏడాది మొదలు కాబట్టి నవ్వుతూ ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచాలి. లేకుంటే దరిద్రం. అలాగే ఆరోజు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇస్తే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తాగకుండా అస్సలు ఉండొద్దు’ అని చెబుతున్నారు.

News March 12, 2026

కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి..

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్ లేదని, బుక్ చేసినా రావడం లేదని యజమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడగా కొందరు కట్టెల పొయ్యి వాడుతున్నారు. చెన్నైలో ఓ హోటల్ యజమాని బట్టీ కట్టించుకుని పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించుకున్నారు. అటు హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఇప్పటికే కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు.