News November 18, 2025

ఇవాళ భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు APSDMA తెలిపింది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. మరోవైపు ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెప్పారు.

Similar News

News November 18, 2025

1383 పోస్టులకు నోటిఫికేషన్

image

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్. https://aiimsexams.ac.in/

దేశాధినేతలు.. మరణశిక్షలు

image

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిన్న <<18311462>>మరణశిక్ష<<>> విధించింది. ఇలా దేశాధినేతలు ఉరిశిక్ష ఎదుర్కోవడం గతంలోనూ జరిగింది. పాక్‌లో జుల్ఫికర్ అలీ బుట్టో, తుర్కియేలో అద్నాన్ మెండెరెస్, ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లకు మరణశిక్ష అమలైంది. సౌత్ కొరియాలో చున్ డూ హ్వాన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. పాక్‌లో ముషారఫ్‌ మరణశిక్షను తర్వాత రద్దు చేశారు.