News November 19, 2025

ఆపరేషన్ కగార్.. వరంగల్ అన్నల రక్త చరిత్ర..!

image

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ దాడుల్లో ఉమ్మడి WGL జిల్లాకు చెందిన పలువురు కీలక మావోయిస్టు నేతలు ఈ ఏడాదిలో హతమయ్యారు. సెప్టెంబర్ 11న ఛత్తీస్‌గఢ్ గరియాబాద్ అడవుల్లో మడికొండకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ మృతి చెందగా, జూన్ 18న ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేశ్ ఎన్‌కౌంటర్లో హతమయ్యాడు. అలాగే రేణుక, సారయ్య, రాకేశ్ కూడా బీజాపూర్, అబూజ్‌మడ్ అడవుల్లో మృతి చెందారు.

Similar News

News March 22, 2026

ఇండియాలో ఎక్కువ బ్రాంచులు ఉన్న బ్యాంకులు ఇవే

image

1. SBI- 23,085
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 10,228
3. కెనరా బ్యాంక్- 9,948
4. HDFC- 9,545
5. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 8,655
6. బ్యాంక్ ఆఫ్ బరోడా- 8,424
7. ICICI- 7,246
8. యాక్సిస్ బ్యాంక్- 5,976
9. ఇండియన్ బ్యాంక్- 5,955 10. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 5,375

News March 22, 2026

GWL: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’.. కలెక్టర్ ప్రకటన

image

జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వెల్లడించారు. గత వారం తాత్కాలికంగా రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని, ఈనెల 23న జిల్లా కలెక్టరేట్‌లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలతో హాజరుకావాలని ఆయన సూచించారు.

News March 22, 2026

ఈపీడీసీఎల్‌లో భారీగా పెరిగిన విద్యుత్ లోడ్

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది. మార్చిలో రోజువారీ వినియోగం 96 మిలియన్ యూనిట్లకు చేరి సెంచరీకి దగ్గరైంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 10% పెరుగుదల నమోదైంది. ఎండల తీవ్రతతో ఏసీలు, కూలర్లు వినియోగం పెరగడం ప్రధాన కారణం. గ్యాస్ కొరతతో ఇండక్షన్ స్టౌవ్లు, ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం కూడా అధికమైంది. పీక్ అవర్స్‌లో లోడ్ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.