News November 18, 2025
హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్.. గ్రౌండ్‌లోకి సీఎం రేవంత్!

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ త్వరలోనే హైదరాబాద్‌కు రానున్నారు. “GOAT India Tour 2025”లో భాగంగా డిసెంబర్‌లో స్నేహపూర్వక మ్యాచ్ జరిగే అవకాశం ఉందని TPCC చీఫ్ మహేశ్ సంకేతాలిచ్చారు. ఆ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనవచ్చన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహం పెంచుతున్నాయి. తెలంగాణను క్రీడా హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అథ్లెట్లకు పూర్తిస్థాయి మద్దతు అందిస్తున్నామని మహేశ్ తెలిపారు.
Similar News
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్‌ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్‌స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్‌లోనూ పాట్ కమిన్సే కెప్టెన్‌గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్‌లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

శబరిమల భక్తులకు అలర్ట్

శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. నదిలో మునిగేటప్పుడు ముక్కు మూసుకోవాలని సూచించారు.