News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Similar News

News March 12, 2026

కృష్ణా: ఒకటే బిల్లు.. ట్రిప్పులు వాళ్లిష్టం!

image

కృష్ణాలో<<19360004>> ఇసుక మాఫియా<<>> అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. ఒకే బిల్లుతో రోజంతా ఇష్టం వచ్చినట్లు ట్రిప్పులు వేస్తూ రూ. కోట్ల సంపదను కొల్లగొడుతున్నారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఉన్నా, వాటిని ఉద్దేశపూర్వకంగా ఆపేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భారీ లారీల రాకపోకలతో VJA-అవనిగడ్డ కరకట్ట రోడ్డు పూర్తిగా ధ్వంసమై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోటం లేదన్న విమర్శలొస్తున్నాయి.

News March 12, 2026

కాకినాడ ఆదిత్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ECE, CSE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చివరితేదీ: మార్చి 15, వెబ్‌సైట్: <>https://adityauniversity.in/careers<<>>

News March 12, 2026

తెలంగాణ DGPగా సీవీ ఆనంద్? త్వరలో క్లారిటీ

image

తెలంగాణకు రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు UPSC కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రం నుంచి సీనియర్ IPS అధికారుల పేర్లను కమిటీ పరిశీలించింది. కమిటీ సిఫారసు చేసే ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం కొత్త DGPగా నియమించనుంది. సీవి ఆనంద్, వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శిఖా గోయల్‌, సౌమ్య మిశ్రాల పేర్లను ప్రతిపాదించింది.