News November 18, 2025
ఇన్‌ఛార్జ్ HM, పీడీలకు షోకాజ్ నోటీసులు: DEO

పిడుగురాళ్ల మండలం కరాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై డీఈవో చంద్రకళ స్పందించారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ హెచ్ఎం రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమారిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ వేసి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News November 18, 2025
ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తి ధర ₹7,491

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం పత్తి గరిష్ఠంగా క్వింటా రూ.7,491 పలికింది. వేరుశనగ ధర రూ.6,879 వరకు, ఆముదాలు రూ.5,861 వరకు నమోదయ్యాయి. అయితే, సీసీఐ (CCI) తేమ శాతం పేరుతో పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని వారు కోరారు.
News November 18, 2025
VZM: వినతులు కుప్పల తెప్పలు.. పరిష్కారం ఏ స్థాయిలో?

ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న PGRS కార్యక్రమానికి ప్రజల నుంచి వినతులు పోటెత్తున్నాయి. వాటి పరిష్కారం ఏ స్థాయిలో ఉందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వినతుల పరిష్కారం అంతంత మాత్రమేనని స్వయంగా అర్జీదారులే ఆరోపిస్తున్న పరిస్థితి. వినతుల పరిష్కారానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.