News November 19, 2025

ములుగు: లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా?

image

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు వహిస్తున్న బడే చొక్కారావు @ అలియాస్ దామోదర్ సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1997లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. హిడ్మా ఎన్కౌంటర్‌తో ఆయన పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం కొనసాగిస్తారా? అనేది చూడాలి.

Similar News

News March 18, 2026

BHPL: డిప్యూటీ తహశీల్దార్‌లకు పదోన్నతులు

image

రెవెన్యూ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ సీసీఎల్ఏ అధికారి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు నలుగురు తహశీల్దార్లు నియమితులయ్యారు. ములుగు నుంచి రాపల్లి రాజేశ్వరరావు, కరీంనగర్ నుంచి టి.వసంత్ రావు, టి.స్వరూప రాణి, వరంగల్ నుంచి అడ్లూరి రాజేశ్వర్ రావులకు భూపాలపల్లి జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. త్వరలోనే వీరు విధుల్లో చేరనున్నారు.

News March 18, 2026

జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

image

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.

News March 18, 2026

జమ్మికుంట: రేపు మార్కెట్‌కు సెలవు

image

ఉగాది పండుగను పురస్కరించుకుని రేపు జమ్మికుంట మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ​ప్రభుత్వ సెలవు కారణంగా గురువారం మార్కెట్ కార్యకలాపాలు నిలిపివేయబడతాయని, తిరిగి శుక్రవారం నుంచి యథావిధిగా మార్కెట్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా ఆమె కోరారు.