News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
Similar News
News March 22, 2026
PSL నుంచి IPLకు శనక

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) నుంచి శ్రీలంక T20 కెప్టెన్ దసున్ శనక తప్పుకోనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. IPLలో RR తరఫున ఆయన ఆడే అవకాశముందని పేర్కొన్నాయి. గాయంతో దూరమైన సామ్ కరన్‌ను ఆయన రీప్లేస్ చేస్తారని సమాచారం. కాగా శనకను PSL వేలంలో లాహోర్ క్వాలెండర్స్ 2.2కోట్ల(PKR)కు కొనుగోలు చేసింది. ఇక ఆసీస్ ప్లేయర్ మాక్స్‌వెల్ సహా మరికొంతమంది ఆటగాళ్లు PSL నుంచి తప్పుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.
News March 22, 2026
మేడ్చల్: రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా..?

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో నూతన రేషన్ కార్డుల మంజూరు, మెంబర్ల అడిషన్ ప్రక్రియ జరుగుతున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలో మెంబర్ అడిషన్ జరిగిన కొంతమంది ఇప్పటికీ రేషన్ బియ్యం పొందినట్లు పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు అప్లికేషన్ నంబర్ సహాయంతో స్థానిక మీసేవ, నెట్ కేంద్రాల్లో స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
News March 22, 2026
కామారెడ్డి: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. జిల్లా ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే స్వయంగా కలెక్టరేట్‌కు వచ్చి లిఖితపూర్వకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు సమస్యలను పరిష్కరిస్తారని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


