News April 13, 2024
నెల్లూరు: 43 మందిలో ఒక్కరే పాస్..

చేజర్ల మండల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మెుదటి సంవత్సరంలో 43 మంది విద్యార్థులు చదువుతున్నారు. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే పాసయ్యారు. 42 మంది విద్యార్థులు ఫెయిల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది ప్రభుత్వ అధ్యాపకుల నిర్లక్ష్యమని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఇంటర్ లో 27 మందికి గాను 13 మంది ఫెయిల్ అయ్యారు.
Similar News
News April 1, 2026
నెల్లూరు: హైవే పక్కనే మద్యం షాపులు..!

నెల్లూరులో మందు బాబులకు ఇబ్బంది లేకుండా అడుగుకొక బార్, వైన్ షాపులు దర్శనమిస్తున్నాయి. నెల్లూరు హైవేకు సమీపంలో చిల్డ్రన్స్ పార్క్ నుంచి దీన్ దయాల్ నగర్ వరకు 7షాపులు ఉన్నాయి. మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ దారిలో రెండు, అస్లీ ఢాబా పక్కన ఒకటి, ఎన్టీఆర్ నగర్ సమీపంలో రెండు, దీన దయాల్ నగర్ వద్ద ఒకటి ఉన్నాయి. ఇవి హైవేకి సమీపంలో ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
News April 1, 2026
నెల్లూరు జిల్లా అధికారులకు CM వార్నింగ్

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు 67.37% మంది సంతృప్తిగా ఉంటే నెల్లూరు జిల్లాలో 69.33%మంది ఉన్నారని CM చంద్రబాబు చెప్పారు. ‘కలెక్టర్ హిమాన్షు శుక్లా పనితీరు బాగుంది. ఇంకా బాగా పనిచేసి ప్రజల ఓట్లు మాకు వచ్చేలా చూడండి. ఉదయగిరిలో R&B, రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ప్రజల సంతృప్తి మైనస్‌లో ఉంది. బీ కేర్‌ఫుల్. నేను ఆకస్మిక తనిఖీలకు వస్తా. దొరికితే చర్యలు తప్పవు’ అని సీఎం హెచ్చరించారు.
News April 1, 2026
ఉదయగిరి వాళ్లు బాగా సంపాదించారు: సీఎం

ఉదయగిరికి పరిశ్రమలు వస్తాయని ఎవరూ ఊహించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. వింజమూరులో ఆయన మాట్లాడుతూ.. ‘పంటలు పండకపోవడంతో ఉదయగిరి ప్రజలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఉదయగిరిలో డబ్బులు లేవు కానీ.. ఇక్కడి నుంచి బయటకు వెళ్లిన వాళ్లు బాగా సంపాదించారు. వాళ్లంతా ఉదయగిరిలో పెట్టుబడులు పెట్టాలి. ఇప్పటికే ఇక్కడికి రెండు పరిశ్రమలు వచ్చాయి. ఉదయగిరిని టూరిస్ట్ ప్లేస్‌గా మారుస్తా’ అని CM ప్రకటించారు.


