News November 18, 2025

నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో నాసిరకం భోజనం..?

image

NZB జిల్లా డిచ్‌పల్లి పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో వంటల్లో నాసిరకం సరకులు వాడుతున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వర్సిటీలోని హాస్టల్ విద్యార్థులు వంట సామగ్రి నాణ్యతపై నిరసన తెలియజేశారు. ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ మెస్‌లో వంటకాలను తయారు చేయడానికి నిల్వ ఉన్న, తక్కువ నాణ్యత గల సరకులు వినియోగిస్తున్నారని, దీనివల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుందని విద్యార్థులు వాపోయారు.

Similar News

News November 18, 2025

NTJ-5 పొట్టి జొన్న రకంతో అధిక దిగుబడి

image

నంద్యాల పరిశోధనా స్థానం నుంచి NTJ-5 జొన్న రకం విడుదలైంది. ఇది అధిక దిగుబడినిచ్చే పొట్టి జొన్న రకం. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు. వర్షాభావ పరిస్థితులకు ఇది అనుకూలం. ఈ సజ్జ గింజలు పసుపు-తెల్ల రంగులో ఉంటాయి. కరువు ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. NTJ-5 రకం దిగుబడి హెక్టారుకు 48 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ రకం మొక్క 150-180 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. కిందకు పడిపోదు.

దడ పుట్టిస్తున్న వానరాలు.. వేములవాడలో కోతులతో పరేషాన్

image

వేములవాడ ఆలయంలో కోతులు హల్‌చల్ చేస్తున్నాయి. పట్టణంలో కొంతకాలంగా కోతుల సంచారం ఎక్కువైంది. ముఖ్యంగా భక్తుల సంచారం అధికంగా ఉండే ఆలయ పరిసరాల్లో వానరాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఆలయ ముఖ్య బుకింగ్ కౌంటర్ క్యూలైన్లో కోతులు వాటికి కావాల్సిన ఆహారం కోసం అటుఇటు తిరుగుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో కోతులు వస్తుండడంతో క్యూలైన్లలోని భక్తులు భయపడుతున్నారు.