News November 19, 2025
మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News March 15, 2026
VJA: ముస్లిం సోదరులకు ఎంపీ చిన్ని పిలుపు

విజయవాడలో ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇఫ్తార్ విందును విజయవంతం చేయాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ముస్లిం మైనారిటీ నేతలతో ఏర్పాట్లపై సమీక్షించిన ఎంపీ, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రంజాన్ పవిత్రత ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
News March 15, 2026
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: జిల్లా SP

అన్నమయ్య జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా SP ధీరజ్ తెలిపారు. ఆదివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో బందోబస్తుపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, చివరికి బందోబస్తులో ఉన్న పోలీసులు కూడా పరీక్షా కేంద్రంలోకి ఫోన్లు తీసుకురాకూడదు. 144 సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద ఉంటుందన్నారు.
News March 15, 2026
చంద్రబాబుకు అల్లు అర్జున్ థాంక్స్

AP సీఎం చంద్రబాబు నాయుడికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. శిరీష్, నయనిక దంపతులను <<19384357>>ఆశీర్వదించడానికి<<>> శనివారం అల్లు ఇంటికి చంద్రబాబు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌లో విదేశాల్లో ఉన్న ఐకాన్ స్టార్.. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన Xలో పోస్ట్ చేసి సీఎంకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు.


