News November 19, 2025

మోతే: భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

image

భార్య పద్మను రోకలిబండతో బాది హత్య చేసిన భర్త కారింగుల వెంకన్నను మోతే పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. సిరికొండకు చెందిన వెంకన్న, భార్య పద్మపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి ఆవేశంలో పద్మను చంపాడు. నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

Similar News

News March 21, 2026

10 రోజుల్లో రూ.13,320 తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.12,160 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,900, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,36,540 పలుకుతోంది.

News March 21, 2026

HYD: బడ్జెట్‌లో పోలీస్ కమిషనరేట్లకు నిధులు

image

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లకు కలిపి బడ్జెట్ లో రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా HYD పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా…ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు రూ.40 కోట్లను కేటాయించారు. సైబరాబాద్ కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.

News March 21, 2026

మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

image

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్‌ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. LPG ఉన్న పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్‌లు ప్రస్తుతం UAEలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గతవారం రెండు LPG నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మనదేశానికి చేరుకున్నాయి. వీటికి కూడా ఇరాన్ అడ్డుకట్ట వేయదని IND భావిస్తోంది. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది.