News November 18, 2025
పెదాలు పగులుతున్నాయా?

శీతాకాలంలో పెదాలు తరచూ పొడిబారి పగిలిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే వెన్న, నిమ్మరసం, దోస, టమాటా గుజ్జు పూయాలి. లిప్‌బామ్ రాయడం మర్చిపోకూడదు. రాత్రి పడుకునే ముందు నేతితో పెదాలను మర్దనా చేయడం వల్ల కూడా పెదాలు మృదువుగా ఉంటాయి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులనే వాడాలి. అలాగే మంచి పోషకాహారం, తగినంత నిద్ర మిగతా శరీర భాగాల్లాగే పెదాలకూ అవసరం. కాబట్టి జీవనశైలి బావుండేలా చూసుకోవాలి.
Similar News
News November 18, 2025
NTJ-5 పొట్టి జొన్న రకంతో అధిక దిగుబడి

నంద్యాల పరిశోధనా స్థానం నుంచి NTJ-5 జొన్న రకం విడుదలైంది. ఇది అధిక దిగుబడినిచ్చే పొట్టి జొన్న రకం. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు. వర్షాభావ పరిస్థితులకు ఇది అనుకూలం. ఈ సజ్జ గింజలు పసుపు-తెల్ల రంగులో ఉంటాయి. కరువు ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. NTJ-5 రకం దిగుబడి హెక్టారుకు 48 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ రకం మొక్క 150-180 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. కిందకు పడిపోదు.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.