News April 13, 2024
చరిత్ర సృష్టించిన ఢిల్లీ

ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 160పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. నిన్నటి మ్యాచులో లక్నో నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లక్నోపై పంజాబ్ ఛేదించిన 160 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్(159) ఉంది.
Similar News
News March 14, 2026
1,300 బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు 6 రోజులే గడువు

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వయసు 21-30 ఏళ్లు, డిగ్రీ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 19. వెబ్‌సైట్: https://www.idbi.bank.in/
News March 14, 2026
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇకపై నో ప్రైవసీ.. అలాంటి మెసేజ్‌లు చేస్తే..

Instagram నుంచి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను మే 8 తర్వాత తొలగించనున్నట్లు Meta ప్రకటించింది. ఇకపై యూజర్లు పంపే కంటెంట్‌ను Meta చూడనుంది. అయితే ఈ మార్పులకు గల కారణాలను కంపెనీ వెల్లడించలేదు. పిల్లల పట్ల లైంగిక, ఇతర వేధింపులకు సంబంధించిన మెసేజ్‌లను గుర్తించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. కాగా హానికర కంటెంట్‌ను గుర్తించేందుకు ఇలాంటి మార్పులు తేవాలని పలు దేశాలు గతంలోనే డిమాండ్ చేశాయి.
News March 14, 2026
10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్?

AP: ఉగాది రోజున 60 విభాగాల్లో 10వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


