News November 19, 2025

ఉమ్మడి కరీంనగర్‌లో BCలకు 268 GPలే..!

image

50% రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధనతో బీసీలకు 22 శాతం రిజర్వేషన్ల క్యాప్‌తో ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,216 గ్రామపంచాయతీల(GP)లో 22% రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు మొత్తంగా 268 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి. ఇక రిజర్వేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News March 12, 2026

కాకినాడ ఆదిత్య యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో ECE, CSE, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర విభాగాల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చివరితేదీ: మార్చి 15, వెబ్‌సైట్: <>https://adityauniversity.in/careers<<>>

News March 12, 2026

తెలంగాణ DGPగా సీవీ ఆనంద్? త్వరలో క్లారిటీ

image

తెలంగాణకు రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు UPSC కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రం నుంచి సీనియర్ IPS అధికారుల పేర్లను కమిటీ పరిశీలించింది. కమిటీ సిఫారసు చేసే ముగ్గురిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం కొత్త DGPగా నియమించనుంది. సీవి ఆనంద్, వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శిఖా గోయల్‌, సౌమ్య మిశ్రాల పేర్లను ప్రతిపాదించింది.

News March 12, 2026

UPSCపై వివాదం.. ఇంటర్వ్యూలో పక్షపాతం?

image

UPSC సివిల్స్‌లో రిజర్వ్‌డ్ క్యాండిడేట్స్‌కు అన్యాయం జరుగుతోందంటూ SMలో చర్చ జరుగుతోంది. మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించినా.. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్ వస్తున్నట్లు ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇంటర్వ్యూ బోర్డు పక్షపాతం వల్లే అంటోంది. మెయిన్స్‌లో టాప్ మార్కులు వచ్చిన ఓ రిజర్వ్‌డ్ క్యాండిడేట్‌కు ఇంటర్వ్యూలో 60/275 మార్కులే వచ్చినట్లు ఉదహరిస్తోంది. దీన్ని మరో వర్గం మాత్రం కొట్టిపారేస్తోంది.