News November 18, 2025
పీఎం కిసాన్ అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో? లేదో? ఇలా చెక్ చేసుకోండి. ☛ ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ను సందర్శించాలి.
☛ ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
☛ అక్కడ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం (మీ వ్యవసాయ భూమి ఉన్న గ్రామం) వివరాలను ఎంపిక చేసుకొని ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
☛ అక్కడ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితా వస్తుంది.
Similar News
News November 18, 2025
మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు అగ్రనేతలున్నట్లు సమాచారం. టైగర్ జోన్‌లో కూంబింగ్ కొనసాగుతోంది. ఏపీ-ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.

సతీశ్ మృతి కేసు.. కీలకంగా ఫోన్ డేటా!

AP: టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసు దర్యాప్తులో ఆయన ఫోన్‌లోని సమాచారం కీలకంగా మారింది. ఫోన్ ధ్వంసమవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్ 13న అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఆ రెండు తేదీల మధ్య ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలుసుకునేందుకు మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.