News November 18, 2025
‘ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత’ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండకూడదన్న <<18069484>>నిబంధనను <<>>ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. ఈ రూల్‌ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. 1994లో ఉమ్మడి APలో జనాభా నియంత్రణ లక్ష్యంగా ఈ నిబంధన తీసుకొచ్చారు.
Similar News
News November 18, 2025
NTJ-5 పొట్టి జొన్న రకంతో అధిక దిగుబడి

నంద్యాల పరిశోధనా స్థానం నుంచి NTJ-5 జొన్న రకం విడుదలైంది. ఇది అధిక దిగుబడినిచ్చే పొట్టి జొన్న రకం. దీని పంటకాలం 100 నుంచి 105 రోజులు. వర్షాభావ పరిస్థితులకు ఇది అనుకూలం. ఈ సజ్జ గింజలు పసుపు-తెల్ల రంగులో ఉంటాయి. కరువు ప్రాంతాల్లో సాగుకు ఇది అనుకూలం. NTJ-5 రకం దిగుబడి హెక్టారుకు 48 నుంచి 50 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఈ రకం మొక్క 150-180 సెంటీమీటర్లు మాత్రమే పెరుగుతుంది. కిందకు పడిపోదు.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,740 తగ్గి రూ.1,23,660కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,600 పతనమై రూ.1,13,350 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,70,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.