News November 19, 2025

నేటి నుంచి ఉమ్మడి వరంగల్‌లో పత్తి కొనుగోలు ప్రారంభం

image

ఉమ్మడి వరంగల్‌లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభం కానున్నాయి. సీసీఐ కొనుగోళ్లలో తలెత్తిన సమస్యలను పది రోజుల్లో పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ట్రేడర్స్ అసోసియేషన్ బంద్ విరమించింది. సచివాలయంలో మంత్రి నాగేశ్వరరావు, అధికారులు, సీసీఐ ప్రతినిధులు, కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశమై జిన్నింగ్-ప్రెస్సింగ్ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ హామీ మేరకు కొనుగోళ్లు ప్రారంభమవుతాయి.

Similar News

News March 15, 2026

టెన్త్ పరీక్షలకు పోలీసు బందోబస్తు సిద్ధం: ఎస్పీ

image

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం కోనసీమ జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తుతో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ భరోసా ఇచ్చారు.

News March 15, 2026

కామారెడ్డి: 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు

image

రామారెడ్డి మండలం అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని DLPO శ్రీనివాస్ పరిశీలించారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 1,770 మంది కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులతో సన్మానాలు నిర్వహించామన్నారు.

News March 15, 2026

నిజామాబాద్: బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర అధ్యక్షుడు వారికి దిశా నిర్దేశం చేశారు.