News November 19, 2025
అన్నదాత సుఖీభవ- నేడే అకౌంట్లలోకి రూ.7వేలు

AP: PM కిసాన్, అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు చొప్పున జమ కానున్నాయి. PM కిసాన్ కింద ప్రధాని మోదీ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రెండో విడత కింద కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రూ.5వేలు.. మొత్తంగా రూ.7వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేలు చొప్పున జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News March 23, 2026
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఒప్పుకోలేదు: టీమ్

పవన్ కళ్యాణ్ కొత్తగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోలేదని ఆయన ప్రొడక్షన్ టీమ్ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ప్రారంభించే ప్లాన్ లేదని, ఏదైనా ఉంటే అఫీషియల్‌గా ప్రకటిస్తామని తెలిపింది. ‘OG-2’ సినిమా గురించి ఆయనే సరైన సమయంలో ప్రకటన చేస్తారని పేర్కొంది.
News March 23, 2026
యుద్ధంపై 3 ముక్కలాట.. అసలేం జరుగుతోంది?

యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ చేస్తున్న ప్రకటనలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయని, 5 రోజులు <<19457337>>దాడులు నిలిపేస్తామని<<>> తొలుత ట్రంప్ ప్రకటించారు. కానీ USతో తాము <<19457474>>సంప్రదింపులే<<>> జరపలేదని ఇరాన్ తెలిపింది. దీంతో నిన్న రాత్రే చర్చించామని, 5రోజుల్లో డీల్ కుదరొచ్చని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ఇంతలోనే టెహ్రాన్‌పై దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ చెప్పడం కన్ఫ్యూజన్‌ను ఇంకా పెంచింది.