News November 18, 2025
సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాలు: సమగ్ర శిక్ష ఏపీసీ

ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు (CWSN) ఐదు ప్రాంతాల్లో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ ఎం.రజనీకుమారి తెలిపారు. ఈ నెల 18న ఎంకే బేగ్ హైస్కూల్(విజయవాడ), 19న మైలవరం, 20న తిరువూరులోని కంభంపాడు, 21న నందిగామ, 22న జగ్గయ్యపేటలోని చిల్లకల్లు జడ్పీహెచ్ఎస్‌లో నిర్వహిస్తామన్నారు.
Similar News
News November 18, 2025
స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.