News November 18, 2025

కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్‌ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్‌ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.

Similar News

News November 18, 2025

విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.