News November 18, 2025

వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

image

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Similar News

News November 18, 2025

స్థానిక పోరుపై ప్రకటన.. ఆశావహుల్లో మళ్లీ ఆశలు..!

image

సోమవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి ప్రకటన చేయడంతో జిల్లాలోని పల్లెల్లోని ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. ముందు గ్రామపంచాయితీ ఎన్నికలు ఉంటాయనడంతో తమ ప్యానెల్‌ను సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు నిమగ్నం అయ్యారు. జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీ గెలవడంతో అదే జోష్‌లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తుందని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.