News November 18, 2025

CSIR-IICBలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ(<>IICB<<>>) 15 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఎస్సీ(కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ), డిగ్రీ, పీహెచ్‌డీ, మెడికల్ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iicb.res.in/

Similar News

News November 18, 2025

మీ భాగస్వామి ఇలా ఉన్నారా?

image

మానసిక సమస్యలున్న వారు బయటకు సాధారణంగానే కనిపిస్తుంటారు. వీరిలో కొందరు భాగస్వామిని మానసికంగా వేధిస్తుంటారంటున్నారు నిపుణులు. తమను తామే గొప్పగా ఊహించుకుంటూ.. నేనే కరెక్ట్, నాకే చాలా విషయాలు తెలుసు అన్న భావనలో ఉంటారు. భాగస్వామి నిర్ణయాలను కూడా వీరే తీసుకుంటారు. భాగస్వామికి తనపై ఆసక్తి తగ్గిందని భావిస్తే తనకంటే మంచోళ్లు ఇంకొకరు లేరన్న భావనను వారి మనసుల్లో సృష్టించి వారిపై పట్టు తెచ్చుకోవాలనుకుంటారు.

ప్రభుత్వంపై విమర్శలు.. 65 ఏళ్ల మహిళకు 30 ఏళ్ల జైలు శిక్ష

image

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్కడి కోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా వాట్సాప్ ఆడియో మెసేజ్‌లో నికోలస్‌ను విమర్శించిన మార్గీ ఒరోజ్కో అనే 65 ఏళ్ల వైద్యురాలికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై రాజద్రోహం, ద్వేషాన్ని ప్రేరేపించారనే నిందలు మోపింది. కాగా ప్రస్తుతం వెనిజులాలో 882 మంది రాజకీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నట్లు ఓ NGO వెల్లడించింది.