News November 19, 2025

పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 13, 2026

విజయవాడలో మెడికో మృతి.. DCP స్పందన ఇదే..!

image

విజయవాడలో మెడికో ద్విచక్ర వాహనం అదుపు తప్పి మృతి చెందిన ఘటనపై ట్రాఫిక్ DCP షరీనా బేగం స్పందించారు. కొందరు యువకులు హెల్మెట్ ధరించడంలో విఫలమై ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారన్నారు. జాతీయ రహదారి పైనే కాకుండా, వీధుల్లో సైతం హెల్మెట్ ధరించాలని సూచించారు. జాతీయ రహదారిపై మాత్రమే హెల్మెట్ ధరించాలన్న అపోహను విడాలన్నారు. చిన్న నిర్లక్ష్యం వల్ల మెడికో ప్రాణం పోయిందన్నారు.

News March 13, 2026

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట నిఘా: ఎస్పీ సంకీర్త్

image

భూపాలపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో పని చేస్తోందని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని, ఎవరైనా పరీక్షల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

News March 13, 2026

బీఆర్ఎస్‌పై సిరిసిల్ల ‘తెలుగు తమ్ముళ్ల’ ఆగ్రహం

image

లోకసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, సిరిసిల్ల నేతన్న చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు టీడీపీ ఎంపీల ఫ్లెక్సీలను దహనం చేయడాన్ని సిరిసిల్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఇది అత్యంత దుర్మార్గమైన, పిరికిపందల చర్య అని వారు అభివర్ణించారు.