News November 18, 2025
AIలో గోదావరిఖని విద్యార్థినికి GOLD MEDAL

గోదావరిఖని ఫైవింక్లయిన్‌కు చెందిన విద్యార్థిని కైలాస మోనా ఏఐలో బంగారు పతకం సాధించింది. హుజూరాబాద్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఈమె బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్) విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యింది. త్వరలో జరగనున్న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మోనా ఈ బంగారు పతకాన్ని అందుకోనుంది.
Similar News
News November 18, 2025
JGTL: PM శ్రీ ల్యాబ్‌ల ఏర్పాటులో జాప్యమెందుకు..?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.3.54 కోట్లతో మొత్తం 18 ల్యాబ్‌లను మంజూరు చేయగా, ఇప్పటికీ కేవలం 3 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 15 ల్యాబ్‌ల పనులు కొనసాగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికైనా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఓటమికి 100% బాధ్యత నాదే: ప్రశాంత్ కిశోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.