News November 19, 2025

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

image

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్‌ ఇష్యూస్‌ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్‌&డైలాగ్‌ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Similar News

News March 21, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

image

పవన్-హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు Sacnilk తెలిపింది. ఇండియాలో రూ.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.7 కోట్లు సాధించినట్లు వివరించింది. మొత్తంగా రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయంది. గురువారంతో పోల్చితే శుక్రవారం థియేటర్లలో షోలతో పాటు సీట్ల ఆక్యుపెన్సీ తగ్గిందని పేర్కొంది. మరి మీరు మూవీ చూశారా? ఎలా ఉంది?

News March 21, 2026

ఇరాన్‌పై దాడులకు US సాయం కోరిందా? భారత్ స్పందనిదే..

image

ఇరాన్‌పై బాంబు దాడి చేసేందుకు భారత మిలిటరీ స్థావరాలను వాడుకునేందుకు అమెరికా అనుమతి కోరిందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ఇందులో నిజం లేదని, ఇలాంటి వార్తలను నమ్మవద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల మధ్య ఉన్న లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్(LEMOA) ప్రకారం భారత్ దీనికి అనుమతి ఇవ్వొచ్చని ఓ జర్నలిస్ట్ చేసిన పోస్టుకు MEA ఈ విధంగా స్పందించింది.

News March 21, 2026

త్వరలో ప్రధాని మోదీ తెలంగాణ టూర్!

image

ప్రధాని మోదీ రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో GHMC ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మోదీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో ప్రధాని టూర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.