News November 19, 2025
పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 27, 2026
లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్‌మెంట్ 12వ ఫ్లోర్‌లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్‌ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్‌ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.
News March 27, 2026
భద్రాద్రి: సీఎంకు ఐదు విలీన గ్రామాలపై విజ్ఞప్తి

సారపాక ఐటీసీ అతిథి గృహంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ పొదెం వీరయ్య, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటరావు, ఎంపీ బలరాం నాయక్.. ఏపీలో ఉన్న 5 విలీన గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని, భద్రాచలం–వాజేడు ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
News March 27, 2026
రేపు గవర్నర్ చేతుల మీదుగా భద్రగిరి మార్ట్ ప్రారంభం

పౌష్టికారమైన ఆహార పదార్థాలతో పాటు ఆర్గానిక్ సంబంధించిన నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందించడానికి భద్రాచలంలో నెలకొల్పిన భద్రగిరి మార్ట్ శనివారం(రేపు) గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. శుక్రవారం సాయంత్రం యూనిటీ అధికారులతో కలిసి భద్రగిరి మార్ట్‌ను ఆయన సందర్శించి గిరి మార్ట్‌లో సరుకులను, ఆర్గానిక్ వస్తువులను పరిశీలించారు.


