News November 19, 2025
పటాన్‌చెరు: 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పటాన్‌చెరు పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఇస్నాపూర్ X రోడ్ వద్ద వాహన తనిఖీల్లో సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ అనూప్ దేవానంద్‌తో కలిసి లారీని తనిఖీ చేశారు. లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం ఉన్నట్లు తేలింది. 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. లారీ యజమాని జయవీర్, డ్రైవర్ నారాబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 25, 2026
మచిలీపట్నం RTA ఆఫీస్‌పై ఏసీబీ దాడులు

మచిలీపట్నంలో రవాణా శాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లలో అక్రమాలపై అధికారులు రికార్డులు, కంప్యూటర్లు, పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
News March 25, 2026
అత్యంత కాలుష్య పట్టణం మన దేశంలోనే..

ప్రపంచంలో అత్యంత కాలుష్య పట్టణంగా లోనీ(UP) నిలిచింది. స్విస్ సంస్థ IQఎయిర్ విడుదల చేసిన గ్లోబల్ ర్యాంకింగ్స్-2025లో ఈ విషయం వెల్లడైంది. అత్యంత కలుషితమైన రాజధానుల జాబితాలో న్యూఢిల్లీ టాప్‌లో ఉంది. అదే సమయంలో వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా పాకిస్థాన్ నిలిచింది. ఈ లిస్టులో ఇండియా 6వ ప్లేస్‌లో ఉంది. 2025 నాటికి ప్రపంచంలో కేవలం 14% నగరాలు మాత్రమే WHO ఎయిర్ క్వాలిటీ ప్రమాణాన్ని అందుకున్నాయి.
News March 24, 2026
VZM: క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం

జిల్లాలో క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా టీబీ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ ఎస్. జీవనరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. హై-రిస్క్ ప్రాంతాల్లో స్క్రీనింగ్, గ్రామాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.


