News November 19, 2025
కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News March 4, 2026
అన్నమయ్య: యుద్ధం.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి!

యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భరోసానిచ్చారు. ఆయా దేశాల్లో అన్నమయ్య జిల్లా వాసులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఢిల్లీ ఏపీ భవన్, ఏపీలోనూ 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని మంత్రి వెల్లడించారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే 0863-2340678 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
News March 4, 2026
బాపట్ల: భూములకు హక్కులు కల్పించే ప్రక్రియ వేగవంతం

నిషేధిత భూముల జాబితాలో ఉన్న అర్హుల భూములకు హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి ఆదేశించారు. అమరావతి నుంచి నిర్వహించిన వీడియో సమావేశంలో జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ హాజరయ్యారు. వ్యవసాయ, నిషేధిత భూముల వివరాలపై తక్షణ నివేదిక ఇవ్వాలని, పీజీఆర్ఎస్ అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు.
News March 4, 2026
వనపర్తి: పదో తరగతి ఫలితాల్లో 100% లక్ష్యం: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం వెల్టూరులోని బీసీ బాలికల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


