News November 19, 2025
అకౌంట్లలోకి రూ.7వేలు.. వీరికి పడవు

AP: అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నేడు రూ.7వేలు జమ కానున్నాయి. అయితే నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
Similar News
News April 1, 2026
MBNR: ఈనెల 8, 9న స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమం

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్ నెట్ ఆవేర్నెస్, టీం వర్క్, ఇంటర్వ్యూ స్కిల్స్ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్ ఉపాధి కల్పన కార్యాలయంలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. వివరాలకు 99485 68830 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News April 1, 2026
AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.
News April 1, 2026
ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్‌పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్‌క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.


