News November 18, 2025
రూమ్ బుకింగ్ పేరుతో రూ. 18 లక్షలు దోచేశారు..!

రూమ్స్ బుక్ చేస్తే పెట్టుబడికి డబుల్ ఆదాయం వస్తుందని రాజమండ్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫణికుమార్ ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ లింక్ వచ్చింది. లింక్‌ను ఓపెన్ చేసి తొలుత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి డబుల్ లాభం పొందాడు. దీంతో నమ్మకం కలిగి, రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ మురళీకృష్ణ కేసు నమోదు చేశారు.
Similar News
News November 18, 2025
జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గోవిందారంలో 8.6℃ల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కథలాపూర్ 9.4, మన్నెగూడెం 9.7, తిరుమలాపూర్ 9.8, గొల్లపల్లి 9.9, మల్లాపూర్, పూడూర్ 10, జగ్గసాగర్, పెగడపల్లె 10.2, అయిలాపూర్ 10.3, రాఘవపేట 10.4, మేడిపల్లె, మల్యాల్, మద్దుట్ల, నేరెళ్ల 10.6, పొలస 10.7, అల్లీపూర్, కొల్వాయి 10.8, కోరుట్లలో 10.9℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.

మంచిర్యాలలో అమానవీయ ఘటన

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్‌కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.