News November 18, 2025

కొడంగల్‌లో చిరుతపులి సంచారం..?

image

కొడంగల్ మండలంలోని ఇందనూర్, రావులపల్లి గ్రామాల శివార్లలో చిరుత పులి సంచరిస్తుండటంతో గ్రామస్థులు భయపడుతున్నారు. చిరుత సంచారం గురించి సోమవారం గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సవిత, ఫరూక్ అలీ, రవి ఘటనా స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతను వెంటనే బంధించాలని గ్రామస్థులు కోరారు.

Similar News

News November 18, 2025

జిల్లాలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గోవిందారంలో 8.6℃ల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కథలాపూర్ 9.4, మన్నెగూడెం 9.7, తిరుమలాపూర్ 9.8, గొల్లపల్లి 9.9, మల్లాపూర్, పూడూర్ 10, జగ్గసాగర్, పెగడపల్లె 10.2, అయిలాపూర్ 10.3, రాఘవపేట 10.4, మేడిపల్లె, మల్యాల్, మద్దుట్ల, నేరెళ్ల 10.6, పొలస 10.7, అల్లీపూర్, కొల్వాయి 10.8, కోరుట్లలో 10.9℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.

మంచిర్యాలలో అమానవీయ ఘటన

image

మంచిర్యాలలో అమానవీయ ఘటన జరిగింది. సాయి హనుమాన్ నగర్‌కు చెందిన వృద్ధురాలు నాడెం రాజు ఆదివారం రాత్రి మృతి చెందింది. కుమార్తె లలిత పాత ఇంటిలో వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మృతదేహాన్ని పాత మంచిర్యాలలోని ఇంటికి తరలించింది. ఈ విషయం సీఐ ప్రమోద్ రావు దృష్టికి వెళ్లడంతో ఆయన జోక్యంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చారు. తల్లి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై పంచుకునేందుకు అంగీకారం కుదరడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.