News November 19, 2025
కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 9.3°C, లచ్చపేట 9.5, గాంధారి 9.6, డోంగ్లి, నస్రుల్లాబాద్ 9.7, బొమ్మన్ దేవిపల్లి, మేనూర్‌లలో 9.8, రామలక్ష్మణపల్లి 9.9, సర్వాపూర్ 10, బీర్కూర్ 10.2, జుక్కల్ 10.5, ఇసాయిపేట,రామారెడ్డి, ఎల్పుగొండ 10.6, పుల్కల్ 11, దోమకొండ 11.1, బిక్కనూర్ 11.3°C నమోదయ్యాయి.
Similar News
News April 1, 2026
ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్

ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు సరుకుల పంపిణీ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సరుకుల అందజేతకు అన్ని చర్యలు తీసుకున్నారు. బుధవారం నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో కార్డుదారులకు బియ్యం, చక్కెర గోధుమపిండిని అందజేస్తారు.
News April 1, 2026
ఉమ్మడి అనంత జిల్లాలో గ్యాస్ కష్టాలు: మంత్రి సవిత క్లారిటీ

గ్యాస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. మంగళవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. ఎప్పటిలాగే ఇండెంట్ పెట్టిన వారందరికీ సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తారన్నారు. యుద్ధం నేపథ్యంలో భవిష్యత్తులోనూ ఇబ్బందులు రాకూడదని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు.
News April 1, 2026
నేడు చర్లలో విద్యుత్తు సరఫరా నిలిపివేత

చర్ల మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. RWS ఫీడర్ పరిధిలో అత్యవసర లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఉ.9 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్‌ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల లక్ష్మీ కాలనీ, నాయకుల కాలనీ, ఏకలవ్య, కస్తూరిబా పాఠశాలలు, దేవానగరం, దోసిల్లపల్లి, తాలిపేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.


