News November 19, 2025

నాగర్ కర్నూల్: రేపు కబడ్డీ జట్ల ఎంపికలు

image

NGKL(D) కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి MJP(CBM) కళాశాలలో రేపు కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ఎం.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ తెలిపారు. జూనియర్ బాలికలు(31-12-2005) తర్వాత జన్మించి, బరువు 65kgs లోపు, సీనియర్ మహిళలు 75kgs లోపు ఉండాలన్నారు. ఒరిజినల్ బోనోఫైడ్, టెన్త్ మెమో,ఆధార్‌తో హాజరు కావాలన్నారు. వివరాలకు 77803 42434 సంప్రదించాలన్నారు.

Similar News

News March 25, 2026

సిద్దిపేటలో పోటీకి ఎవరో ఎందుకు రేవంతే రావచ్చు: హరీశ్ సవాల్

image

TG: తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ CM కాలేడని BRS నేత హరీశ్ విమర్శించారు. ‘ఏ టైమ్‌లో గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది మేమే. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా BRSదే గెలుపు. KCR CM. సిద్దిపేటలో పోటీకి ఎవరినో పెట్టడం ఎందుకు రేవంత్ రెడ్డే రావచ్చు’ అని సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహణలో GOVT విఫలమైందని, ప్రజాసమస్యలపై చర్చే లేదని మీడియాతో చిట్ చాట్‌లో విమర్శించారు.

News March 25, 2026

తమిళనాడులో ‘హీరోయిజం’ పనిచేయట్లేదా?

image

తమిళ రాజకీయాల్లో ఒకప్పుడు అక్కడి సినీపరిశ్రమ ఆధిపత్యం ఉండేది. మాజీ సీఎంలు MGR, కరుణానిధి, జయలలిత ఆ కోవకు చెందిన వారే. కానీ ఇప్పుడు సీన్ మారింది. 2019లో లోక్‌సభ, 2021లో TN అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ఇప్పుడు DMK సపోర్టర్‌‌గా మిగిలింది. దీంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగి సోలోగా పోటీకి సిద్ధమవుతున్న విజయ్ TVK పార్టీ భవితవ్యం చర్చనీయాంశమైంది. <<-se>>#Elections2026<<>>

News March 25, 2026

ఖమ్మంలో 28న జాతీయ లోక్ అదాలత్

image

ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న(శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మంలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఈ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.