News November 19, 2025

మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News April 3, 2026

అల్లూరి జిల్లాలో భారీ వర్షం..కూలిన చెట్టు

image

అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉన్నా..ఒక్కసారిగా వాతావరణం మారి మబ్బులు కమ్మి వర్షం ప్రారంభమైంది. సుమారు రెండు గంటల పాటు ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా చాపగెడ్డ రెడ్డిపై చెట్టు పడడంతో రాకపోకలు నిలిచాయి. సుమారు అర కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయాయి.

News April 3, 2026

ఏప్రిల్ రెండో వారంలో రైతు భరోసా రెండో విడత?

image

TG: రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ రెండో వారంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.2,650 కోట్లు అవసరమని తేల్చారు. ఈ నిధులను రెడీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో సోమవారంలోగా ఆర్థిక శాఖ సర్దుబాటు చేయనుంది. రెండో విడతలో ఎకరానికి మించి 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

News April 3, 2026

కువైట్‌పై ఇరాన్ భీకర దాడులు

image

కువైట్, UAE లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. తమ డీసాలినేషన్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీపై అటాక్ జరిగినట్లు కువైట్ అధికారులు ధ్రువీకరించారు. మినా అల్ అహ్మదీ రిఫైనరీలోని కొన్ని యూనిట్లు మంటల్లో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తమ దేశంపై మిస్సైల్స్, డ్రోన్లతో ఇరాన్ దాడి చేసిందని UAE తెలిపింది. తాము అడ్డుకున్న మిస్సైల్ శకలాలు పడి హబ్షాన్ గ్యాస్ ఫెసిలిటీలో మంటలు చెలరేగాయని చెప్పింది.