News April 13, 2024

ప్రకాశం: స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీ

image

సంతమాగులూరు ఎంపీడీవో కార్యాలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రమైన ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు పాఠశాలలోపలికి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతినగా ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2026

ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

image

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

News March 15, 2026

అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

image

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 15, 2026

ప్రకాశం: 7th క్లాస్ బాలికతో 9th క్లాస్ బాలుడికి పెళ్లి

image

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు ఒంగోలులోని ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.