News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 10, 2026
గుంటూరులో పలు రైళ్ల రద్దు.. మార్గంలో మార్పులు

రాయనపాడు యార్డు పనుల నేపథ్యంలో గుంటూరు మార్గంలో రైళ్ల సేవల్లో మార్పులు చేశారు. మే 2 నుంచి 5 వరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి. మే 1 నుంచి 4 వరకు కొన్ని రైళ్లను గుంటూరు మార్గం మీదుగా మళ్లించనున్నారు. మచిలీపట్నం-షిర్డీ రైలు మే 5న మార్గం మార్చనుంది. ప్రయాణికులు ముందస్తు సమాచారం తీసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
News April 10, 2026
బయటపడిన పాక్ కపట బుద్ధి.. లక్ష్యమిదే?

పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని ఇజ్రాయెల్ చేసిన <<19605543>>ప్రకటన<<>> ఒక్కరోజులోనే నిజమైంది. దాయాది కపట బుద్ధి బయటపడింది. ఇన్నాళ్లూ ఇరాన్‌పై జరిగిన దాడులను ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఇప్పుడు కాళ్లావేళ్లా పడి ‘మీడియేటర్’ హోదా తెచ్చుకోగానే అగ్రరాజ్యం, భారత్‌కు మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై పాక్ మంత్రి ఖవాజా <<19612683>>విషం కక్కారు<<>>. తద్వారా ఆ దేశాన్ని విలన్‌ను చేసి అమెరికా పంచన చేరాలనేది పాక్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
News April 10, 2026
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మహానాడు..!

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ మహానాడు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్థల పరిశీలనకు సిద్ధమయ్యారు. రణస్థలంతో పాటు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కూడా స్థల పరిశీలన చేయనున్నారు. శుక్రవారం ఉదయం పల్లా బృందం భోగాపురం మండలంలో పర్యటించనుంది. వచ్చేనెల 27 నుంచి మహానాడు జరగనుంది.


