News November 19, 2025
HYD: వరుసగా ముహుర్తాలు.. మాల్స్ ఫుల్

ఈ నెలలో వచ్చే వారంలో భారీగా ముహూర్తాలు ఉండడంతో బేగంపేట, పంజాగుట్ట, ఉప్పల్, కొంపల్లి, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి. మాల్స్ వద్ద వస్త్రాల కొనుగోలు జరుగుతుండగా, బంగారు దుకాణాల్లో సైతం జనం పెరుగుతున్నారు. 3 రోజులుగా డిమాండ్ మరింత పెరిగిందని షాపుల యజమానులు చెబుతున్నారు.
Similar News
News March 25, 2026
నెల్లూరులో ఇద్దరు అధికారులపై వేటు

నెల్లూరు శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల విషయంలో అవకతవకలు జరగడంతో ZP ఏవో RPS వర్మను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో శ్రీధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శిక్షణ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అధిక బిల్లులు సమర్పించిన డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ యహోషువాను APSIRDకి సరెండర్ చేశారు. ట్రైనింగ్ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడడంతో చర్యలు తీసుకున్నారు.
News March 25, 2026
ఇరాన్‌కు అమెరికా పెట్టిన షరతులు ఇవే!

శాంతి ప్రణాళికల్లో భాగంగా ఇరాన్‌కు ట్రంప్ 15 అంశాలను ప్రతిపాదించినట్లు US మీడియా చెబుతోంది. అణ్వాయుధ ప్రయత్నాలను మానుకోవడం, హార్ముజ్ తెరిచి ఉండటం, యురేనియం తవ్వకాలను ఆపడం, న్యూక్లియర్ మెటీరియల్‌ను అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి బదిలీ చేయడం, మిలిటెంట్లకు మద్దతు ఆపడం ఇందులో మెయిన్ డిమాండ్స్. ఇందుకు ప్రతిగా ఆంక్షలు పూర్తిగా తొలగించి, అణువిద్యుత్‌కు మద్దతు ఇస్తామని US ప్రతిపాదించినట్లు సమాచారం.
News March 25, 2026
HYD: నిమ్మ ధరలతో దిమ్మతిరుగు!

నగర మార్కెట్లో నిమ్మకాయల ధరలు దిమ్మతిరిగిపోతున్నాయి. అకాల వర్షాలు, ఉత్పత్తులు పడిపోవడం, వేసివి అధిక వినియోగంతో వీటి ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక నిమ్మకాయ రూ.10 పలుతోంది. దారుషిఫా హోల్ సేల్ మార్కెట్లో 25 కిలోల నిమ్మకాయల బస్తా ప్రస్తుతం రూ.2,000 నుంచి రూ.3,500 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ నాణ్యత నిమ్మకాయలు మార్కెట్లో బస్తాకు రూ.1,500 నుంచి రూ.1,800కు అమ్ముడవుతున్నాయి.


