News November 18, 2025

పశువుల మేతగా ‘అజొల్లా’తో లాభాలు

image

అజొల్లాలో ఎక్కువ మాంసకృత్తులు, తక్కువ లిగ్నిన్ ఉండటం వల్ల పశువులు దీన్ని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. వెటర్నరీ నిపుణుల సూచనలతో వేరుశనగపొట్టుకు బదులు రోజూ 2kgల అజొల్లాను పశువుల దాణాతో కలిపి పాడిపశువులకు పెడితే పాల నాణ్యత పెరిగి, పాల ఉత్పత్తిలో 15-20 శాతం వృద్ధి కనిపిస్తుంది. అజొల్లాతో పశువుల పెరుగుదలకు కావాల్సిన కాల్షియం, భాస్వరం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.

Similar News

News November 18, 2025

ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్‌ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.

భారత్‌కు ప్రతి టెస్టు కీలకమే

image

WTC 2025-27 సీజన్‌లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్‌కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్‌లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.