News November 19, 2025
బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News March 18, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 18, 2026
HNK: బాల్యానికి బ్రేక్ లేదు.. ట్రాఫిక్‌కు కట్టడి ఎక్కడ?

WGL ట్రై సీటీలో 15 ఏళ్లు కూడా నిండని చిన్నారులు నంబర్ ప్లేట్లు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ సిగ్నల్స్ వద్ద దర్జాగా ఆగడం కనిపిస్తోంది. ఇదే వరంగల్ పోలీసుల “ఎవర్ విక్టోరియస్” పనితీరా? అని ప్రజలు సర్కాస్టిక్‌గా ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News March 18, 2026
గ్యాస్ సిలిండర్ల కొరత.. విజయవాడ హోటల్స్‌లో సాంబార్ కట్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇంధన సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో విజయవాడలోని పలు హోటల్స్‌లో మెనూ మారిపోయింది. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడంతో టిఫిన్ హోటల్స్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్‌తో పాటు అందజేసే సాంబార్ తయారీ నిలిపివేశారు. సాంబార్‌తో పాటు కొన్ని ఐటమ్స్‌ను మెనూ నుంచి తొలగించినట్టు పలు హోటల్స్ నిర్వాహకులు బోర్డులు పెడుతున్నారు.


