News November 19, 2025

బాపుఘాట్ సుందరీకరణ.. DECలో ప్రారంభం!

image

HYD మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టులో భాగంగా గండిపేట నుంచి బాపూఘాట్ వరకు సరికొత్త నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్లానింగ్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ నది సుందరీకరణ పనులను చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్లో పనులు ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News March 17, 2026

వేములవాడ: 19న ఉగాది, 27న సీతారాముల కళ్యాణం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రంలో ఈనెల 19వ తేదీ గురువారం ఉగాది పర్వదిన వేడుకలు నిర్వహించనున్నారు. 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. 27వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ పార్కింగ్ స్థలం వద్ద గల శివార్చన వేదికపై స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

News March 17, 2026

GNT: అన్‌ఎయిడెడ్ స్కూల్ టీచర్లకు డీఈఓ ప్రకటన

image

గుంటూరు జిల్లాలోని అన్‌ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు డీఈఓ కీలక ప్రకటన చేశారు. అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు www.deognt.blogspot.inను చూడొచ్చన్నారు. దరఖాస్తు దారులకు మార్చి 22న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు గుంటూరులో సర్టిఫికెట్ల పరిశీలన, డెమో క్లాసులు ఉంటాయని అధికారులు తెలిపారు.

News March 17, 2026

గుంటూరు: టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

image

ఉమ్మడి గుంటూరు (D)లోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన తాత్కాలిక/జనరల్ సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితా DEO అధికార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్న వారు సంబంధిత ఆధారాలతో మార్చి 22 లోపు గుంటూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పీల్ రిసీవింగ్ కమిటీకి సమర్పించాలని సూచించారు.