News November 18, 2025
ఆరుట్ల బుగ్గ జాతర 40 వేల మంది భక్తులు

కార్తీక చివరి సోమవారం భక్తులు ఆరుట్ల బుగ్గ జాతరకు పోటెత్తారు. మహిళలు భారీ సంఖ్యలో సత్యనారాయణ వ్రతాలు ఆచరించేందుకు మక్కువ చూపారు. నీళ్లలో దీపాలను వెలిగించి శివయ్యను కొలిచారు. దాదాపు సోమవారం ఒక్కరోజే 40 వేల మంది భక్తలు ఆలయానికి వచ్చినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ గురువారం చివరి రోజు కావడంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బుగ్గ జాతరకు మీరూ వెళ్తున్నారా?
Similar News
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4 నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా.. తమకేం తెలవదని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు ముందు నిరసన తెలిపారు.