News November 18, 2025
KNR: మీ ఏరియాలో ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏది..?

కార్తీకం..రేపటితో లాస్ట్. పౌర్ణమికి ముందే ప్రారంభమైన అయ్యప్ప మాలధారణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కప్పడు జిల్లా నుంచి ఒకరిద్దరు తప్ప పెద్దగా మాలలు వేసేవారు కాదు. కాగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతోంది. ఇక మన ఉమ్మడి KNRలోని ప్రముఖ అయ్యప్ప ఆలయాల్లో దీక్షను స్వీకరించడం పరిపాటి. మరి మీ ప్రాంతంలోని ఫేమస్ అయ్యప్ప టెంపుల్ ఏదో COMMENT చేయండి. ఆ లిస్ట్‌ను కార్తీకమాసం చివరిరోజు బుధవారం Way2Newsలో ప్రచురిస్తాం.
Similar News
News November 18, 2025
MBNR: నవోదయ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

బండమీదిపల్లి, వట్టెం జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 13న జరగనుంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టికెట్లను https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ జానకిరాములు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షలను 29 కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

NLG: మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా

నల్గొండ పట్టణంలోని 3వ వార్డు పాతపల్లెకు చెందిన 12 సంఘాల పేరున ఆ గ్రామానికి చెందిన బుక్ కీపర్ ఒకరు బ్యాంకు ఫీల్డ్ అధికారులతో కలిసి కుమ్మక్కై కోటిన్నర రుణాలు తీసుకున్నారు. 4 నెలల నుంచి చెల్లింపులు ఆగడంతో బ్యాంకు సిబ్బంది బాధితుల దగ్గరికి వెళ్లగా.. తమకేం తెలవదని వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. బుక్ కీపర్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్యాంకు ముందు నిరసన తెలిపారు.